క్రిమినల్స్ కే కాదు ఎడ్యుకేటడ్ కి కూడా వర్మే ఇన్స్పిరేషన్.!
May 10, 2018 / 08:01 AM IST
|Follow Us
ఇప్పటివరకూ రాంగోపాల్ వర్మ సినిమాలు చూసి హత్యలకు, దొంగతనాలకు పాల్పడిన వారిని మాత్రమే చూసాము. వర్మ తెరకెక్కించిన “మద్యాహ్నం హత్య” సినిమా చూసి ఒక వ్యక్తి నిజంగానే తన భార్యను హత్య చేసి ఒక బాక్స్ లో ప్యాక్ చేసిన ఉదంతం చూశాం, అలాగే ఆయన తెరకెక్కించిన వివిధ సినిమాలు చూసి రకరకాల దొంగతనాలు, క్రైమ్స్ పాల్పడిన వ్యక్తులను కూడా చూశాం. కానీ.. మొట్టమొదటిసారిగా వర్మ చూసి ఇన్స్పైర్ అయిన ఒక వ్యక్తి సివిల్స్ లో టాపర్ గా నిలిచాడు. ఇటీవల రిజల్ట్స్ వచ్చిన సివిల్స్ లో టాపర్ గా నిలిచిన అక్షయ్ కుమార్ యాదవల్లి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో “నన్ను ఆర్జీవి చాలా ఇన్స్పైర్ చేస్తారు.
నేను ఆయన ఇంటర్వ్యూస్ రెగ్యులర్ గా చూస్తాను. ఆయన క్యారెక్టర్, ఐడియాలిజీ నాకు బాగా ఇష్టం” అని చెబుతున్నాడు అక్షయ్ కుమార్. ఇదే విషయాన్ని వర్మ కూడా షేర్ చేసి నేను క్రిమినల్స్ ని మాత్రమే కాదు ఇలా మంచిని కూడా ఇన్స్పైర్ చేస్తున్నాను కాస్త గుర్తించండి అని ట్వీట్ చేయడం విశేషం. అయినా.. సినిమాల్ని ప్రేక్షకులు చూసే విధానం బట్టి వారి ఆలోచనాధోరణి ఆధారపడి ఉంటుంది కానీ, సినిమాలు జనాల్ని ఎఫెక్ట్ చేయవు అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తిస్తారో ఏమో.