పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ
July 5, 2017 / 07:45 AM IST
|Follow Us
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ కొన్ని సార్లు, విమర్శిస్తూ కొన్ని సార్లు వర్మ గతంలో ట్వీట్స్ చేశారు. అతని ట్వీట్స్ పై పవన్ కళ్యాణ్ కూడా విభిన్నంగా స్పందించారు. పెళ్లి అయిన కూతురు ఉన్న అతను ఈ వయసులో పోర్న్ వీడియోలు చూస్తానని చెప్పే వ్యక్తి గురించి తానేమీ మాట్లాడనని సెటైర్ వేశారు. ఆ తర్వాత కూడా మాటల యుద్ధం సాగింది. చివరకి పవన్ జోలికి వెళ్లనని స్పష్టం చేశారు. అంతేకాదు అసలు ట్విట్టర్ అకౌంట్ నే క్లోజ్ చేశారు. అయినా అతని తీరు మార్చుకోలేదు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు.
“పవర్ స్టార్, పోర్న్ స్టార్ కి దూరంగా ఉండాలి. దూరం నుంచే వారిని అభిమానించాలి. దగ్గరకి వెళితే వారు కూడా సాధారణ మనుషులే అని తెలుసుకొని అభిమానం తగ్గిపోతుంది” అని తనదైన శైలిలో వర్మ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. పవన్ చేసే ట్వీట్స్ అసహజంగా ఉంటాయని, ఎక్కడో పుస్తకాల్లోంచి కాపీ చేసి పేస్ట్ చేసినట్లుగా ఉంటుందని విమర్శించారు. అతని ప్రసంగాలు మాత్రం బాగుంటాయని ప్రశంసించారు. వర్మ కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహిస్తున్నారు. వర్మకి పిచ్చి తగ్గలేదని పోస్టులు చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.