నేనే రాజు నేనే మంత్రి సినిమా పై వర్మ ఎమ్ అన్నారు అంటే?
August 14, 2017 / 12:53 PM IST
|Follow Us
డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత.. కొంతమేర బ్రేకింగ్ న్యూస్ తగ్గాయి. వ్యక్తి స్థాయి గురించి ఆలోచించకుండా తనకొచ్చినట్టు ట్వీట్ చేసే ఆయన ఈ మధ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తొంగి చూస్తున్నారు. రీసెంట్ గా దగ్గుబాటి రానాపై ప్రశంసలు గుప్పించి వార్తల్లో నిలిచారు. ”రానా ఒక మహాద్భుతమని నేను ఎప్పుడో నమ్మాను. అతన్ని ఒక పెద్ద ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్ కు పుట్టిన సాధారణ కొడుకు అని అందరూ అనుకున్నారు. అదే దృష్టితో చూశారు. అటువంటిది ఈరోజు రానా ఒక అగ్ని పర్వతం స్థాయిలోకి ఎదిగిపోయాడు. నేనే ‘ డిపార్ట్ మెంట్ ‘ సినిమాతో ఫ్లాపిచ్చినా.. తేజ మాత్రం “నేనే రాజు నేనే మంత్రి” సినిమాతో భారీ హిట్టే ఇచ్చాడు.” అంటూ వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అలాగే తనదైన స్టైల్లో విమర్శను గుప్పించాడు. ”రానా నటనకు వస్తున్న పొగడ్తలు రివ్యూల పక్కన పెడితే.. అసలు ఎవ్వరూ ఈ సినిమాతో రిలీజైన మరో రెండు సినిమాల్లోని హీరోల గురించే మాట్లాడుకోవట్లేదు. ఎక్కడ చూసినా కేవలం రానా గురించి మాట్లాడుకుంటున్నారు” అని ఇతర హీరోలపై సున్నితంగా విమర్శల జల్లు కురిపించారు. ఈ శుక్రవారం వచ్చిన మూడు చిత్రాల్లో “నేనే రాజు నేనే మంత్రి” ఎక్కువ కలక్షన్స్ తో దూసుకుపోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.