RGV: మరణం విషయంలోనూ వెరైటీ మానుకోని వర్మ

  • June 29, 2021 / 05:31 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ తీసే సినిమాలు ఎంత విచిత్రంగా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. సగటు దర్శకులెవరూ అలాంటి సినిమాలు తీయడానికి ముందురారు. కానీ అందుకే ఆయన విజయాల శాతం తక్కువ కావొచ్చు కానీ, ఆయన టచ్‌ చేయని జోనర్‌ అంటూ ఏదీ ఉండదు. ఇంతటి వైవిధ్యాన్ని ఆయన తన చావులో కూడా చూపించాలి అనుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్రేజీ డెత్‌ సీన్ గురించి వివరించారు. వర్మ క్రేజీ నెస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువ.

చాలా సందర్భాల్లో ఆయన ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే తన చావు వచ్చే ముందు ఓ న్యూక్లియర్ బాంబ్‌ బ్లాస్ట్‌ను చూడాలని అనుకుంటున్న చెప్పుకొచ్చారు వర్మ. మనిషి పుట్టాక చనిపోవడం కామన్‌. చావు ఎప్పుడు వస్తుందా అని దాని గురించి భయపడుతూ బాధపడటంలో ఉపయోగం లేదు. అందుకే నా చావు న్యూక్లియర్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ చూస్తూ ఉండాలని అనుకుంటున్నారు అని చెప్పారు వర్మ. ఫలానా ప్రాంతంలో అణుబాంబు పడుతోంది, పేలుతోందని ఎవరైనా చెబితే…

అక్కడికి వెంటనే వెళ్లి ఆ బ్లాస్ట్‌ను చూడాలి అనుకుంటున్నారు. ఆ క్రమంలో నేను చనిపోయినా ఓకే అని చెప్పారు వర్మ. దీని గురించి వివరిస్తూ ‘ఇండోనేసియాలో సునామీ వచ్చినప్పుడు ఓ వ్యక్తి పారిపోకుండా… సునామీ అలలను చూశాడు. పారిపోయినా లాభం లేదని గ్రహించాడు కాబట్టే… అక్కడే ఉండి చూసి, చనిపోయాడు’ అని చెప్పారు వర్మ.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus