Ridhi Dogra: బాలయ్యపై ఫైర్ అయిన హీరోయిన్ రిధి డోగ్రా.. అలా కామెంట్స్ చేస్తూ?
June 4, 2024 / 12:31 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో స్టార్ హీరో బాలయ్య (Balakrishna) తరచూ వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అంజలిని (Anjali) నెట్టేసిన వివాదంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా ఈ వివాదానికి సంబంధించి హీరోయిన్ రిధి డోగ్రా (Ridhi Dogra షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. బాలయ్యను టార్గెట్ చేస్తూ రిధి డోగ్రా ఒకింత షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్య మహిళను కించపరిచేలా వ్యవహరించినా అంజలి నవ్వుతోందని రిధి డోగ్రా అన్నారు.
డబ్బు, పేరున్న మగాళ్లు పనికిమాలిన పని చేసినా ఈ ప్రపంచం తప్పు పట్టదని రిధి డోగ్రా పేర్కొన్నారు. ఎందుకంటే అలాంటి పురుషులు ఏం చేసినా పరవాలేదనే స్థాయికి తీసుకొచ్చారని ఆమె వెల్లడించారు. ఒకవేళ అదే సమయంలో అంజలి కఠినంగా వ్యవహరించి ఉంటే అంజలి విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యేదని రిధి డోగ్రా చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం చిన్మయి ఏ విధంగా రియాక్ట్ అయ్యారో రిధో డోగ్రా కూడా అదే విధంగా రియాక్ట్ కావడం జరిగింది.
అయితే ఇదే సమయంలో అంజలి మాత్రం చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారనే విధంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. బాలయ్య మాత్రం నెగిటివ్ కామెంట్లను అస్సలు పట్టించుకోవడం లేదు. బాలయ్య త్వరలో బాబీ (Bobby) మూవీ షూట్ తో బిజీ కానున్నారు. మరికొన్ని గంటల్లో బాలయ్య హిందూపురం ఫలితం తేలిపోనుంది. బాలయ్య ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
స్టార్ హీరో బాలయ్య గత సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయనే సంగతి తెలిసిందే. బాలయ్య ఇకపై వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొంతమంది కావాలనే బాలయ్యను టార్గెట్ చేస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.