Shyam Singha Roy: ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ .. పాట బాగుండేలా ఉందిగా..!
November 2, 2021 / 06:34 PM IST
|Follow Us
నాని కథానాయకుడిగా ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘నిహారిక ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయినపల్లి నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ‘ప్రేమమ్’ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రం పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
టైం ట్రావలింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం నుండీ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పేరుతో ఓ ప్రోమోని విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషలతో కలిపి ఒకే ప్రోమోగా విడుదల చేయడం జరిగింది. ‘శ్యామ్ సింగరాయ్.. అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే’ అంటూ సాగిన ఈ ప్రోమోకి మిక్కీ ఇచ్చిన ట్యూన్ చాలా బాగుంది.
కృష్ణ కాంత్ అందించే లిరిక్స్ కూడా హైలెట్ గా నిలిచే అవకాశం ఉందని ఈ ప్రోమో హింట్ ఇచ్చింది. నాని లుక్ కూడా కొత్తగా ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది.లెజెండ్ శ్యామ్ పాత్రలో నాని ఆటిట్యూడ్ కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రోమో స్పష్టంచేసింది. ఫుల్ సాంగ్ నవంబర్ 6న విడుదల కాబోతుందట. ఇక డిసెంబర్ 24 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.