భర్తతో కలిసి జెనీలియా చేసిన ‘మిస్టర్ మమ్మీ’ ట్రైలర్ మామూలు కామెడీగా లేదుగా!
October 29, 2022 / 07:18 PM IST
|Follow Us
బాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్దికాలంగా స్పీడ్ తగ్గింది. తెలుగు, కన్నడ సినిమాలు నార్త్ బాక్సాఫీస్‌ని షేక్ చేసేశాయి. ఎంత భారీస్థాయిలో సినిమాలు ప్లాన్ చేసినా.. టాప్ స్టార్స్ యాక్ట్ చేసినా కానీ మెజారిటీ మూవీస్ బొక్క బోర్లా పడ్డాయి. ‘కార్తికేయ 2’, ‘కాంతార’ లాంటి చిన్న చిత్రాల వసూళ్లు కూడా హిందీ వాళ్లకి సాలిడ్ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రయోగాత్మకమైన సినిమా తెరకెక్కుతోంది. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా డిసౌజా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘మిస్టర్ మమ్మీ’..
షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్నాడు. టీ సిరీస్ సంస్థతో కలిసి శివ అనంత్, షాద్ అలీ నిర్మిస్తున్నారు. ఈ ఇలాంటి పాయింట్‌కి కామెడీ యాడ్ చేసి కొత్త కథను అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు మేకర్స్. రీసెంట్గా ‘మిస్టర్ మమ్మీ’ ట్రైలర్ రిలీజ్ చేశారు. కొత్త ప్రయోగంతో ఇప్పటివరకు వినడం, చదవడం లేదా ఏదో హాలీవుడ్ మూవీలో చూడడం తప్ప ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి నేపథ్యంలో సినిమా రాలేదనే చెప్పాలి. పిల్లలంటే ఇష్టం లేని భర్త ఓ బేబీకి జన్మనివ్వాల్సి వస్తే ఎలా ఉంటుంది?..
అసలు పురుషుడు, మహిళలా గర్భం దాల్చడానికిగల కారణాలేంటి?.. దానివల్ల అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? .. అనే ఇంట్రెస్టింగ్ అంశాలతో ‘మిస్టర్ మమ్మీ’ రూపొందుతుంది. ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచే విధంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుందంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా జెనీలియా కపుల్‌కి కంగ్రాట్స్ చెప్తున్నారు.
రితేష్ క్యారెక్టర్లో కొత్తగా కనిపించడమే కాక కన్ఫ్యూజన్తో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. జెనిలీయా హౌస్ వైఫ్ పాత్రలో కనిపిస్తోంది. కొంతగ్యాప్ తర్వాత ఈ రియల్ లైఫ్ కపుల్ నటించిన ‘మిస్టర్ మమ్మీ’ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. విజువల్స్ , బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. మహేష్ మంజ్రేకర్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. నవంబర్ 11న ‘మిస్టర్ మమ్మీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.