Riteish Deshmukh: అభిమాని కాళ్లు పట్టుకున్న జెనీలియా భర్త.. ఏం జరిగిందంటే?

  • December 5, 2022 / 10:38 AM IST

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన జెనీలియా ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా ఆమె నటించిన తెలుగు సినిమాలు ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేశాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పాపులారిటీ లేకపోయినా ఇతర ప్రాంతాల్లో మాత్రం ఆయనకు ఊహించని రేంజ్ లో పేరు, గుర్తింపు ఉండటం గమనార్హం. తాజాగా రితేష్ దేశ్ ముఖ్ అభిమాని కాళ్లు పట్టుకుని అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.

ప్రస్తుతం రితేష్ జెనీలియాతో కలిసి మజిలీ మూవీ రీమేక్ లో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నెల చివరి వారంలో రిలీజ్ కానున్న ఈ సినిమాతో రితేష్ జెనీలియా ఖాతాలో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉన్నా రితేష్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఒక కాలేజ్ క్యాంపస్ కు వెళ్లిన రితేష్ దేశ్ ముఖ్ కు ఒక ఫ్యాన్ షాకిచ్చారు.

రితేష్ కు వీరాభిమాని అయిన ఒక లేడీ ఫ్యాన్ రితేష్ అనుమతితో అతనికి ఆల్బమ్ ను బహుమతిగా ఇవ్వడంతో పాటు డ్యాన్స్ చేశారు. రితేష్ తో డ్యాన్స్ చేయడంతో సదరు లేడీ ఫ్యాన్ సంతోషాన్ని పట్టలేక ఎమోషనల్ కావడంతో పాటు రితేష్ పాదాలకు నమస్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత రితేష్ ఆ అభిమాని పాదాలకు నమస్కరించడంతో స్టూడెంట్స్ షాక్ కు గురయ్యారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్న రితేష్ గ్రేట్ అని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మజిలీ సినిమాలో భార్యాభర్తలైన చైతన్య సమంత నటించగా ఆ సినిమా రీమేక్ లో కూడా భార్యాభర్తలైన జెనీలియ రితేష్ నటిస్తున్నారు. మజిలీ రీమేక్ హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus