Rithika: ‘బేబీ’ కాంబోలో మూవీ మిస్ అయ్యిందా.. అసలు మేటర్ అది..!
November 1, 2023 / 06:01 PM IST
|Follow Us
ఆనంద్ దేవరకొండ – వైష్ణవి కాంబినేషన్లో ‘బేబీ’ అనే సినిమా వచ్చింది. ఇది సూపర్ హిట్ అయ్యింది. దర్శకుడు సాయి రాజేష్ కి అలాగే నిర్మాత ఎస్.కె.ఎన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ముఖ్యంగా ఆనంద్ – వైష్ణవి..ల మధ్య వచ్చే సన్నివేశాలు అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ పెయిర్ మళ్ళీ ఇంకో సినిమాలో కనిపిస్తే బాగుణ్ణు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఈ కాంబినేషన్లో ‘డ్యూయెట్’ అనే సినిమా రాబోతుంది అంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది.
అయితే ఈ సినిమా నుండి వైష్ణవి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో వైష్ణవి మళ్ళీ ఆనంద్ కి హ్యాండ్ ఇచ్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ కాంబినేషన్లో సినిమా లేదు అంటూ కొందరు అభిమానులు కూడా హర్ట్ అవుతున్నారు. అయితే అది కొంతవరకు నిజమే కానీ.. పూర్తిగా కాదు. ముందుగా ‘డ్యూయెట్’ అనే ప్రాజెక్టు కోసం ఆనంద్ – వైష్ణవి..లని అనుకున్న మాట నిజం కానీ.. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది.
దానికి ఎస్.కె.ఎన్, సాయి రాజేష్(బేబీ దర్శకుడు).. నిర్మాతలు. ఇక ‘డ్యూయెట్’ సినిమాకి జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఇక వైష్ణవి తప్పుకోవడంతో (Rithika) రితిక నాయక్ ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎంపికైంది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో ఆమె మంచి మార్కులు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె లుక్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ‘డ్యూయెట్’ చిత్రం రేపు అనగా నవంబర్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.