Rithu chowdary: నాన్నను చివరి క్షణాల్లో కూడా చూడలేదు!
November 20, 2023 / 01:22 PM IST
|Follow Us
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రీతు చౌదరి ఒకరు. ఈమె తెలుగులో బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేసినటువంటి ఈమె రోజు రోజుకు ఎంతో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ కమెడియన్ గా కూడా గుర్తింపు పొందినటువంటి రీతు వర్మ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
తన నాన్నమ్మ సంవత్సరీకం కోసం నిమిత్తమా ఊరికి వెళ్ళమని అక్కడ కూడా తన తండ్రి తనతో చాలా మంచిగా సరదాగా మాట్లాడారని ఈమె తెలియజేశారు. ఇక తాను యూట్యూబ్ ఛానల్ కోసం తన ఊరిలో ఒక వ్లాగ్ కూడా చేయమని తన తండ్రి తనకు చెప్పినట్లు ఈమె తెలిపారు. ఇలా రాత్రంతా ఎంతో కబుర్లు చెప్పుకొని వెళ్లి పడుకో పోమ్మా పొద్దున్నే లేవాలి కదా అని నాన్న నన్ను పంపించారు.
అయితే అందరూ పడుకున్న తర్వాత నాన్నకు గుండె నొప్పి వచ్చిందని అప్పటికి కూడా నాకు చెప్పకుండా ఉన్నారని కానీ నేను పొద్దున లేసి విన్న మాట నాన్న చనిపోయారు అదే మాట నేను విన్నాను అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. నాకెంతో ఇష్టమైనటువంటి కారులో నాన్నను హాస్పిటల్ కి తీసుకెళ్లారని ఇప్పటికి నేను ఆ కారులో ప్రయాణిస్తున్న నాన్న (Rithu chowdary) నాతో ఉన్నట్టే ఉంటుందని ఈమె తెలిపారు.
ఎంతో సరదాగా గడిపినటువంటి నాన్న ఉన్నఫలంగా మరణించడం తనకు తీరని లోటనీ నాన్న చివరి క్షణాల్లో కూడా నేను చూడలేదు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక నాన్న మరణించిన తర్వాత నాన్న శవం మీదనే తాను ఇంటి బాధ్యతలు తీసుకుంటానని శపథం చేశానని రీతూ చౌదరి ఎమోషనల్ అయ్యారు.