రీతూ చౌదరి పరిచయం అవసరంలేని పేరు.ఈమె జబర్దస్త్ నటిగా అలాగే యూట్యూబర్‌గా ఎన్నో వీడియోలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే ఈమె తాజాగా తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. రీతూ చౌదరి శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన బాయ్ ఫ్రెండును పరిచయం చేస్తే త్వరలోనే తనిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఈమె తెలియజేశారు.
ఈయన హైదరాబాద్ కి చెందిన వ్యక్తి అని తనకు బాగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే అనుకోకుండా రీతూ చౌదరి తండ్రి మరణించడంతో కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరమయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా తిరిగి తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినటువంటి ఈమెకు తన ప్రేమ పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. రీతు చౌదరి మీరు పెళ్లి చేసుకోవద్దు హ్యాపీగా ఉండండి అంటూ కొందరు కామెంట్లు చేశారు. అయితే ఈమె మాత్రం ఎవరిని లవ్ చేయట్లేదని తనతో తాను ప్రేమలో ఉన్నానని తెలిపారు.
శ్రీకాంత్ తో మాట్లాడుతున్నారా అని అడిగితే.. సారీ.. త్వరలో చెప్తాను అని తెలిపింది. దీంతో రీతూ చౌదరి ఫియాన్సీకి బ్రేకప్ చెప్పింది, వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు అని క్లారిటీ వచ్చేసిందంటున్నారు. మరి వీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోలేదు తెలియాల్సి ఉంది.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!