నయనతారను అనుసరిస్తున్న రితిక సింగ్!

  • October 13, 2017 / 10:03 AM IST

కేరళ బ్యూటీ నయన తారకు సినిమాలు తగ్గిపోతున్నాయి అని అందరూ అనుకున్న సమయాల్లో .. ఆమె టైటిల్ రోల్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. విజయాలతో పాటు రెమ్యునరేషన్ అమాంతం పెంచుకుంది. ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఈ బాటలో నడవడానికి సిద్ధమంది రితికా సింగ్.  “సాలా ఖడూస్‌” సినిమా ద్వారా నటిగా మారిన ఈ క్రీడాకారిణి గురు తో తెలుగు వారికీ పరిచయమంది.

ఆ తర్వాత శివలింగ మూవీలో స్టెప్పులను కూడా వేసింది. కానీ ఆ తరవాత ఆమె ఎక్కడ కనిపించలేదు. కారణం హీరోయిన్ గా చేయడం ఆమెకు ఇష్టం లేదంట. లేడీ ఓరియెంటెడ్ కథలనే వింటునట్టు తెలిసింది. తాజాగా ఓ స్టోరీ కి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందులో క్యాబ్ డైవర్ రోల్లో కనిపించనుందట. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా రితికా కెరీర్ కి ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus