సాల కడూస్ అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరపై అడుగు పెట్టిన రితిక సింగ్ దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకుంది. తెలుగులో గురు సినిమాలో పక్క మాస్ అమ్మాయిగా నటన ఇరగదీసింది. దీంతో తెలుగువారికి ఈమె దగ్గరయింది. శివలింగతో మరింత పేరు తెచ్చుకుంది. అయితే ఈమె నటన కంటే ముందు మార్షల్ ఆర్ట్స్ ఎన్నో మెడల్స్ సాధించింది. సినీ రంగంలోనూ రాణిస్తోంది. 22 ఏళ్లకే ఎంతో పేరు సాధించుకున్న ఈమెను మాట్లాడమని పలు విద్యాలయాలు ఆహ్వానిస్తున్నాయి. రితిక మాటలు ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతోంది.
రీసెంట్ గా రితిక ఓ కాలేజ్ లో ప్రసంగిస్తూ “నాకు నటించడం రాదు. కనీసం సిగ్గుపడడం కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల.. నటన కంటే బాక్సింగ్ చేయడమే ఈజీ అనిపిస్తుంటుంది” అని చెప్పింది. “కరాటే..బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల గురులో ఫైట్స్ ఈజీగానే చేసాను. శివలింగ చిత్రంలో లారెన్స్ తో డ్యాన్స్ చేయడం కష్టమైంది” అని సినీ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్న ముంబై బ్యూటీ, అందాలు ఆరబోయడానికి కూడా సై అంటోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.