రియాకు బెయిల్…సంచనల విషయాలు బయటపెట్టిన ముంబై కోర్ట్
October 8, 2020 / 02:25 PM IST
|Follow Us
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నాలుగు నెలలు కావస్తుంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తిని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 20రోజులకు పైగా రియా జ్యూడీషియల్ కస్టడీ అనుభవించారు. పలుమార్లు రియా బెయిల్ పిటీషన్ కొట్టిన వేసిన ముంబై కోర్ట్ తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కోర్ట్ లో రియా చక్రవర్తిపై జడ్జి చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆమెను వాడుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.
రియా సుశాంత్ సింగ్ అకౌంట్ నుండి డబ్బులు కాజేసిందన్న ఆరోపణలు నిజం కాలేదు. ఈడీ అధికారులు సైతం ఆమె ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించలేక పోయారు. ఇక సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు అతనిది ఆత్మహత్యనే అని తేల్చారు. సుశాంత్ డెత్ కేసు నీరుగారుతున్న సమయంలోనే ఈ కేసు డ్రగ్స్ వైపు మళ్లింది. డ్రగ్స్ ఆరోపణలపై ఆమెను, తమ్ముడు షోవిక్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కొనుగోళ్ళకు పాల్పడినట్లు, వాటి అమ్మకాల ద్వారా రియా ఆర్థికంగా ప్రయోజనాలు పొందినట్లు ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ ఆమెను మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు, ప్రజల దృష్టిలో ఆమెను చెడ్డగా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. బీహార్ ఎన్నికల కోసం అధికార ప్రభుత్వం పన్నిన పన్నాగమే ఇది అని తెలుస్తుంది.