బిగ్ బాస్ హౌస్ నుంచీ ఈవారం అనూహ్యంగా ఆర్జే సూర్య అవుట్ అయినట్లుగా సమాచారం. గెేమ్ పరంగా ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఆర్జే సూర్యకి పెద్దగా ఫాలోయింగ్ లేదు. అందుకే, నామినేషన్స్ లోకి వచ్చినపుడు చాలా టెన్షన్ పడ్డాడు. ఇక ఈవారం 14మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉండటం అనేది ఆర్జే సూర్యకి కలిసి రాలేదు. గత వారం టాస్క్ రద్దు అవ్వడం వల్ల కెప్టెన్ లేడు. అందుకే హౌస్ మొత్తం నామినేషన్స్ ని ఎదుర్కున్నారు. ఇందులో అన్ అఫీషియల్ పోలింగ్స్ ని బట్టీ చూస్తే రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. రేవంత్ తర్వాత సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్ ఉన్నాడు.
నిజానికి వీళ్లిద్దరు మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగతా వాళ్లలో ఈసారి ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చని అనుకున్నారు చాలామంది. కానీ, ఊహించని విధంగా ఆర్జేసూర్య ఎలిమినేట్ అయిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సూర్య ఎలిమినేట్ అయిపోయినట్లుగా న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆర్జే సూర్య ఫస్ట్ నుంచీ కూడా తన గేమ్ లో కొద్దిగా తడబడ్డాడు. ఆరోహి ఉన్నప్పుడు ఆరోహిని పాంపర్ చేయడం, తన చుట్టూనే ఎక్కువగా ఉండటం అనేది సూర్య గేమ్ ని దెబ్బకొట్టింది.
ఆరోహి వెళ్లిపోయిన తర్వాత ఆర్జే సూర్య చుట్టూ ఇనయ తిరిగింది. దీంతో వీరిద్దరి మద్యలో మంచి బాండంగ్ ఏర్పడింది. అంతేకాదు, ఇనయ కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చినపుడు ఆర్జే సూర్య అంటే ఇష్టమని, అతడంటే క్రష్ అని చెప్పడం, అతనితోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడం అనేది చేసింది. ఇక రీసంట్ గా నామినేషన్స్ అప్పుడు నీకు బయట బుజ్జమ్మ ఉందని నాకు తెలుసు, అందుకే మన మద్య ఉన్నది స్నేహం మాత్రమే అని చెప్పడానికే నామినేట్ చేస్తున్నా అంటూ నామినేట్ చేసింది.
ఇనయతో పాటుగా శ్రీసత్య, ఇంకా వాసంతీ ఇద్దరూ కూడా సూర్యని నామినేట్ చేశారు. దీంతో సూర్యకి ఈవారం మూడు నామినేషన్స్ ఓట్లు పడ్డాయి. ఇక ఫస్ట్ నుంచీ సోషల్ మీడియాలో పెద్దగా ఓటింగ్ పై ప్రభావాన్ని చూపలేకపోయాడు సూర్య. అందుకే, ఓటింగ్ లో బాగా వెనకబడ్డాడు. అన్ అఫీషియల్ వెబ్ సైట్స్ లో ప్రతి చోట లీస్ట్ లో, డేంజర్ జోన్ లో ఉండిపోయాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం ఆర్జే సూర్య జెర్నీ ముగిసిపోయినట్లే. అదీ మేటర్.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!