Robinhood: ఆ తేదీ విషయంలో తగ్గేదేలే అంటున్న నితిన్.. అలా క్లారిటీ వచ్చేసిందిగా!
July 20, 2024 / 09:14 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేయడం తలనొప్పిగా మారింది. పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్లలో మార్పులు చోటు చేసుకుంటూ ఉండటం మిగతా సినిమాలపై ఊహించని స్థాయిలో ప్రభావం చూపుతోంది. డిసెంబర్ నెల టార్గెట్ గా ఎక్కువ సంఖ్యలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తండేల్ (Thandel) మూవీ డిసెంబర్ రేస్ నుంచి తప్పుకుందని వార్తలు వినిపించాయి. అయితే తండేల్ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ మార్పుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
అయితే నితిన్ (Nithiin) రాబిన్ హుడ్ (Robinhood) మాత్రం ముందుగా ప్రకటించిన డిసెంబర్ నెల 20వ తేదీనే థియేటర్లలో విడుదల కానుందని వెల్లడైంది. కన్నప్ప (Kannappa) , గేమ్ ఛేంజర్ (Game Changer) , బాలయ్య (Balakrishna) – బాబీ (Bobby) కాంబో మూవీ సైతం డిసెంబర్ నెలను టార్గెట్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి పండుగకు ఇప్పటికే పలు సినిమాలు షెడ్యూల్ అయిన నేపథ్యంలో పెద్ద సినిమాలకు, మిడిల్ రేంజ్ సినిమాలకు డిసెంబర్ ఆప్షన్ గా నిలుస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో థియేటర్లు మాత్రం కళకళలాడతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. డిసెంబర్ నెలలో రిలీజ్ కానున్న సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమా విషయంలో నితిన్ సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల డైరెక్టర్ కాగా శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ దొంగగా కనిపించనున్నారు.
వెంకీ కుడుముల (Venky Kudumula) నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ 20వ తేదీ విషయంలో అస్సలు తగ్గనని హీరో నితిన్ చెప్పకనే చెబుతున్నారు.