ఆన్ లైన్ లో 2.0 టీజర్ సంచలనం!

  • March 4, 2018 / 07:13 AM IST

రజనీకాంత్ టైటిల్ పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ విజువల్ వండర్ “రోబో 2”. 2010లో విడుదలైన “రోబో”కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదు. అట్టహాసంగా దుబాయ్ లో జరిగిన ఆడియో విడుదల అనంతరం సినిమాకి సంబంధించిన ఎలాంటి న్యూస్ కానీ ఫోటో కానీ బయటకి రాలేదు. సినిమా అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదల తేదీ కూడా అప్పుడు, ఇప్పుడు అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నారే తప్ప ఎప్పుడు అనేది మాత్రం ఇప్పటివరకూ చెప్పలేదు.

అయితే.. నిన్న రాత్రి నుంచి ఆన్ లైన్ లో “రోబో 2” టీజర్ హల్ చల్ చేస్తోంది. ఎక్కడో పబ్లిక్ ఈవెంట్ లో ప్లే చేసిన టీజర్ ను రికార్డ్ చేసి ఆన్ లైన్ లో పెట్టారు. అది గంటల్లోనే వైరల్ అయిపోయింది. పైరసీ వెర్షన్ టీజర్ కే జనాలు నోరెళ్ళబెట్టారు. హాలీవుడ్ ని మించిన స్థాయి గ్రాఫిక్స్ తో 1.26 నిమిషాల ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకొంటుంది. ఎప్పుడెప్పుడు ఒరిజినల్ టీజర్ ను యూట్యూబ్ లో చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు రజనీ అభిమానులు.

ఇకపోతే.. రజనీ సరసన అమీ జాక్సన్ మరో రోబోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది దీపావళి లేదా క్రిస్మస్ కి “రోబో 2” విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus