Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ మేకర్స్.. ఇది కాస్త గమనించాలి..!
June 21, 2024 / 04:45 PM IST
|Follow Us
మరో 6 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) . ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ .. సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ హాలీవుడ్ సినిమాలకి ధీటుగా అనిపించాయి.
తెలుగు సినిమాలో ఇలాంటి విజువల్సా? అంటూ ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. అందుకే జూన్ 21 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఈ హైప్ ని పెంచుకోవడం మానేసి.. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని త్రీడీలో వీక్షించాలని మేకర్స్ కోరుతుండటం షాకిచ్చే విషయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల 3D వెర్షన్లను రిలీజ్ చేస్తున్నారు.
రిలీజ్ చేస్తే ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ కేవలం త్రీడీలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి అంటూ ప్రమోట్ చేయడం ప్రమాదకరం. గతంలో ‘2.ఓ’ (Robo 2.O) సినిమా విషయంలో దర్శకుడు శంకర్ (Shankar) అండ్ టీం, ఇలా చెప్పడం వల్ల సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమాకి హౌస్ ఫుల్స్ పడలేదు. ‘చూస్తే త్రీడీలో చూడాలి లేకుంటే వేస్ట్ అనే నిర్ణయానికి ప్రేక్షకులు వచ్చేశారు ఆ టైంకి’..!
అందువల్ల ‘2.ఓ’ కలెక్షన్స్ పై ప్రభావం గట్టిగానే పడింది. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడానికి ఇదో కారణమని చెప్పొచ్చు. ‘కల్కి 2898 AD ‘ విషయంలో అదే రిపీట్ అవ్వకుండా మేకర్స్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలి.