Rohit, Revanth: రోహిత్ కి ఎందుకు కోపం వచ్చింది..! కెప్టెన్సీ టాస్క్ లో జరిగిందేంటంటే.?
November 11, 2022 / 10:15 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ చాలా రసవత్తరంగా జరిగింది. చప్పగా సాగిపోతున్న ఎపిసోడ్స్ లో ఒక్కసారి ఉరుములు, మెరుపులు మెరిసినట్లుగా రోహిత్ రెచ్చిపోయాడు. ఇన్ని వారాలు చాలా సైలంట్ గా ఉన్న రోహిత్ ఫ్రస్టేట్ అయిపోయాడు. గేమ్ లో అన్ ఫెయిర్ ఆడారని సంచాల్ రేవంత్ చూస్తు ఉండిపోయావంటూ రెచ్చిపోయి అరిచాడు. అసలు మేటర్లోకి వెళితే, బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ పోటీదారులకి గన్నీబ్యాగ్ టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న సర్కిల్స్ లో తిరుగుతూ గన్నీ బ్యాగ్స్ ని భుజాన వేసుకోవాలి.
అంతేకాదు, గన్నీ బ్యాగ్ లో ఉన్న థర్మాకోల్స్ పడిపోకుండా దాని బరువు తగ్గకుండా చూసుకోవాలి. ఇలా ఎవరి బ్యాక్ అయితే ఎక్కువగా బరువు ఉంటుందో వాళ్లు కెప్టెన్ అవుతారు. ఇక్కడే ఆదిరెడ్డి, ఫైమా, రోహిత్, మెరీనా, శ్రీసత్య, కీర్తి కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఫస్ట్ రౌండ్ లోనే కీర్తి లైన్ దాటిందని అబ్జక్షన్ మొదలుపెట్టింది శ్రీసత్య. దీంతో కీర్తి ఫస్ట్ రౌండ్ లో బయటకి వచ్చేసింది. తను కూడా ఫ్రస్టేట్ అయ్యింది. బాధపడింది. ఆ తర్వాత రౌండ్ లో మెరీనా బ్యాగ్ తక్కువ ఉండటం వల్ల అవుట్ అయ్యింది. ఇక ఇక్కడ్నుంచే ఆటలో మజా వచ్చింది.
రోహిత్ , పైమా ఇంకా ఆదిరెడ్డిలని టార్గెట్ చేశాడు. ఫస్ట్ ఫైమా బ్యాగ్ లో థర్మాకోల్స్ ని లాగే ప్రయత్నం చేస్తే ఆదిరెడ్డి సపోర్టింగ్ గా వచ్చాడు. దీంతో రోహిత్ ఆదిరెడ్డి బ్యాగ్ ని టార్గెట్ చేశాడు. అయితే, సంచాలక్ అయిన రేవంత్ ఎవ్వరూ కూడా బ్యాగ్ లని చేతితో పట్టుకోకూడదని చెప్పాడు. కానీ, హౌస్ మేట్స్ వాళ్ల బ్యాగ్ ని చేతులతోనే కాపాడుకోవడం మొదలు పెట్టారు. దీన్ని రోహిత్ అబ్జక్ట్ చేశాడు. అంతేకాదు, ఫైమా లైన్ దాటిందని కూడా రెండు , మూడు సార్లు సంచాలక్ రేవంత్ కి చెప్పాడు.
అయితే, ఎటాకింగ్ లో లైన్ దాటచ్చని, పూర్తిగా సర్కిల్ దాటకూడదని ముందే చెప్పాడు రేవంత్. అంతేకాదు, సర్కిల్ లో తిరిగేటపుడు ఆదిరెడ్డి బ్యాగ్ ని టార్గెట్ చేసాడు. కానీ, ఆదిరెడ్డి బ్యాగ్ ని చేత్తో పట్టుకుంటున్నాడని క్లియర్ గా హెచ్చరించాడు. చెప్పాడు. కానీ, రేవంత్ వాళ్లిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు. రెండు మూడుసార్లు పాజ్ అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. దీంతో రోహిత్ ఫ్రస్టేట్ అయిపోయాడు. తన బ్యాగ్ లోని థర్మాకోల్స్ పూర్తిగా కిందకి పడిపోయాయి.
రోహిత్ చాలా ఫ్రస్టేషన్ తో కోపంతో బ్యాగ్ ని తంతూ రెచ్చిపోయాడు. అక్కడున్న వస్తువులు నేలకేసి కొట్టి మరీ అరిచాడు. పెద్ద పెద్దగా షటాప్ అంటూ రేవంత్ పై విరుచుకుపడ్డాడు. అంతేకాదు, తన ఫ్రస్టేషన్ ని కోపాన్ని చూపించాడు. వాళ్ల ఆవిడ మెరీనాపై కూడా అరిచాడు. అన్ ఫెయిర్ ఆడారని చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య ఈ ముగ్గురూ కూడా చూస్తూ ఉండిపోయారు.
ఇక్కడ ఎట్టిపరిస్థితుల్లో గేమ్ కంటిన్యూ చేయడానికే వాళ్లు ఇష్టపడ్డారు. దీంతో ఈ రౌండ్ లో రేవంత్ రోహిత్ ని అవుట్ అయినట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత రేవంత్ రోహిత్ దగ్గరకి వచ్చి ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేశాడు. రోహిత్ ని కూల్ చేశాడు. దీంతో కూల్ గా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. నిజానికి ఫైమా, ఆదిరెడ్డి , శ్రీసత్య ఈ ముగ్గురూ కూడా ఈ టాస్క్ లో సేఫ్ గా గేమ్ ని ఆడారు. మరి ఈ ముగ్గురులో టాస్క్ లో గెలిచి పైమా కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. అదీ మేటర్.