Roja: రోజా కొడుకు ఫోటోలపై అలాంటి కామెంట్లు.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?

  • June 28, 2023 / 09:32 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో రోజా ఒకరు. మంత్రి రోజా ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదు. అయితే రోజా కొడుకు, కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. రోజా కొడుకు పుట్టినరోజుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు రోజా కొడుకు గట్టిగా ట్రై చేస్తే సక్సెస్ ఫుల్ హీరో అవుతాడని కామెంట్లు చేస్తున్నారు.

అయితే సినిమాలకు సంబంధించి (Roja) రోజా కొడుకు మనస్సులో ఏముందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. రోజా కొడుకుకు నటనలో శిక్షణ ఇప్పించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. రోజా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతుండటంతో సినిమాలు, టీవీ షోలలో పాల్గొనే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే రోజా మళ్లీ మంత్రి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రోజా కూతురు చాలా టాలెంటెడ్ కాగా ఆమె ప్రతిభకు సంబంధించిన కొన్ని వార్తలు గతంలో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. పొలిటికల్ గా చేసే విమర్శల వల్ల రోజా పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. రోజా పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.

రాబోయే రోజుల్లో కూడా రోజాకు కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా వరుస సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో రోజా ఆచితూచి వ్యవహరించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రోజా తన పిల్లల కెరీర్ పై దృష్టి పెట్టి వాళ్లను ప్రయోజకులను చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus