Roja: ఏపీ పాలిటిక్స్ కు రోజా గుడ్ బై చెబుతారా.. నిజమేంటంటే?
August 10, 2024 / 11:13 AM IST
|Follow Us
ప్రముఖ టాలీవుడ్ నటి, మాజీ ఎమ్మెల్యే రోజా (Roja) 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఫైర్ బ్రాండ్ గా పేరును సొంతం చేసుకున్న రోజా ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడం, తను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పొలిటికల్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతుండటం గమనార్హం. తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ అంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
Roja
స్టార్ హీరో విజయ్ (Vijay) పార్టీ తరపున రోజా పోటీ చేస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే తెలుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే తమిళనాడులో రోజాకు గుర్తింపు కొంతమేర తక్కువేననే సంగతి తెలిసిందే. ఆమె నిజంగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పోటీ చేసినా సక్సెస్ కావడం సులువైన విషయం కాదు. ప్రస్తుతానికి అయితే రోజాకు అలాంటి ఆలోచనలు లేవని తెలుస్తోంది. ఆమె వైసీపీలోనే కొనసాగుతారని సమాచారం అందుతోంది.
రోజా సినిమాలు, టీవీ షోలతో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోజా రీఎంట్రీ ఇచ్చినా అవకాశాలు వస్తాయా? రావా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం. రోజా కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. రోజా వైరల్ అవుతున్న వార్తల గురించి వేగంగా స్పందిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రోజా వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రోజా సరైన పాత్రలతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే మరికొన్ని సంవత్సరాలు నటిగా కెరీర్ ను కొనసాగించవచ్చు. రోజా ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరు తరచూ వినిపిస్తోంది. త్వరలో రోజా భవిష్యత్తు ప్రణాళికల గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.