Rowdy Boys Collections: ఇక బాయ్స్ కు బ్రేక్ ఈవెన్ కష్టమే..!
January 19, 2022 / 09:34 PM IST
|Follow Us
‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కొడుకు ఆశీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ వంటివి యూత్ ను బాగానే ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది.
సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘రౌడీ బాయ్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది పర్వాలేదు అనే టాక్ ను కూడా సంపాధించుకుంది.’బంగార్రాజు’ కి పోటీగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో కూడా ఓకే అనిపించింది కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకర్షించలేకపోయింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.
ఒకసారి 4 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
1.08 cr
సీడెడ్
0.51 cr
ఆంధ్రా(టోటల్)
1.17 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
2.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.05 cr
ఓవర్సీస్
0.09 cr
వరల్డ్ వైడ్ టోటల్
2.90 cr
‘రౌడీ బాయ్స్’ చిత్రానికి రూ.9.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ యవరేజ్ గా ఉండడంతో 4 రోజులకి ఈ చిత్రం రూ.2.90 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. సోమవారం రోజున ఈ చిత్రం కలక్షన్ల దారుణంగా పడిపోయాయి. వీటిని బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ అసాధ్యమనే చెప్పాలి..!