మొదటి షెడ్యూల్ పూర్తయ్యేసరికి తీసింది రెండే సీన్లు
November 24, 2018 / 12:36 PM IST
|Follow Us
“బిజినెస్ మేన్” ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన రాజమౌళి తన సహ దర్శకుడు పూరీ జగన్నాధ్ గురించి మాట్లాడుతూ.. “నేను పూరీ జగన్నాధ్ దగ్గర శిష్యరికం చేయాలి, సినిమా ఫాస్ట్ గా తీయడం ఎలా అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి” అంటూ పొగిడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటే.. తాను సినిమాలు చాలా స్లోగా తీస్తానని రాజమౌళి స్వయంగా ఒప్పుకొన్న సందర్భం అది. ఆ తర్వాత “బాహుబలి” పూర్తి చేయడానికి ఆయన తీసుకొన్న అయిదేళ్లు చాలు ఆయన సినిమాలను ఎంత నిదానంగా తెరకెక్కిస్తాడో. అయితే.. నిబద్ధతతో రూపొందిస్తాడు కాబట్టి ఎంత టైమ్ తీసుకొన్నా పర్వాలేదనుకోండి.
ఇటీవల “ఆర్ ఆర్ ఆర్” రెగ్యులర్ షూట్ ను రాజమౌళి మొదలెట్టిన విషయం తెలిసిందే. తొలి షాట్ నే “ఎన్టీఆర్-రామ్ చరణ్”ల కాంబినేషన్ లో తెరకెక్కించాడు రాజమౌళి. దాదాపు మూడు రోజులపాటు జరిగిన ఈ షెడ్యూల్లో రాజమౌళి ఇప్పటివరకూ ఒకే చేసింది కేవలం రెండు షాట్స్ మాత్రమే. ఈ విషయం తెలిసేసరికి నిర్మాతలు పెద్దగా షాక్ అవ్వలేదు కానీ.. సినిమా వర్గాలు మాత్రం ఆశ్చర్యపోయారు. ఇద్దరు సూపర్ స్టార్ హీరోలను పెట్టుకొని రాజమౌళి ఈ విధంగా సినిమా తీస్తే అది పూర్తయ్యేసరికి ఎన్నాళ్లు పడుతుందో అని భయపడి చస్తున్నారు వారి అభిమానులు. మరి ఈ విషయాన్ని రాజమౌళి కన్సిడర్ చేసి కాస్త త్వరగా కానిస్తే బెటర్ ఏమో.