RRR: జపాన్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ సెన్సేషన్…హాలీవుడ్ సినిమాల రికార్డులే చెల్లాచెదురు..!
May 27, 2023 / 04:40 PM IST
|Follow Us
ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం నెలకొల్పిన సంచలనాలు ఇంకా తగ్గలేదు. ఓ రకంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. రాజమౌళి డైరెక్షన్ కి హాలీవుడ్ ఫిలిం మేకర్సే షాక్ అయ్యారు. విచిత్రం ఏంటంటే ఈ చిత్రం ఇంకా జపాన్ లో ఆడుతూనే ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ చిత్రం అక్టోబర్ 21న జపాన్ లో రిలీజ్ అయ్యింది. జపాన్ వెర్షన్ కోసం రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ లు అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ టీం సభ్యులు జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేసొచ్చారు.అక్కడ ఈ చిత్రం 200 రోజుల నుండి ఇంకా ఆడుతూనే ఉంది. అక్కడ ఈ చిత్రం 1.9 బిలియన్ యన్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. అంటే రూ.115 కోట్లన్న మాట.
ఇంకో విశేషం ఏంటంటే.. (RRR) ఈ మూవీ జపాన్ లో మార్వెల్, డిసి వంటి అన్ని పెద్ద సంస్థల నుండి వచ్చిన సినిమాల కలెక్షన్లను బ్రేక్ చేసిందట. దాదాపు 100 హాలీవుడ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసిందట ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం. ఆ సినిమాలతో సమానంగానే ‘ఆర్.ఆర్.ఆర్’ టికెట్ రేట్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఫుట్ ఫాల్స్ పరంగా కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ హాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా గర్వించదగ్గ విషయం ఇది.