నిప్పు-నీరు కాన్సెప్ట్ లోనే రౌద్రం రణం రుధిరం కథ దాగుందా..?
March 25, 2020 / 12:34 PM IST
|Follow Us
ప్రకటించిన విధంగా ఆర్ ఆర్ ఆర్ నుండి రాజమౌళి అప్డేట్ ఇచ్చేశారు. ఉగాది కానుకగా ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లో ఉన్న ఆ మూడు అక్షరాల అర్థం చెప్పేశారు. కొంచెం ఊహకు దగ్గరగా మరి కొంచెం ఊహించని విధంగా టైటిల్ రౌద్రం రణం రుధిరం అని నిర్ణయించారు. మోషన్ పోస్టర్ రాజమౌళి సినిమా రేంజ్ లో రిచ్ అండ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా హీరో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.
టైటిల్ మొదటి పదంలో రౌద్రం లో చరణ్ ని చూపించిన రాజమౌళి మరో పదం రుధిరం లో ఎన్టీఆర్ ని పరిచయం చేశారు. వీరి లుక్స్ కూడా కొంచెం అస్పష్టంగా రాజమౌళి చూపించడం జరిగింది. ఐతే వీరిలో ఒకరిని నిప్పుగా మరొకరిని నీరుగా రాజమౌళి చూపించారు. ఈ నిప్పు, నీరు కాన్సెప్ట్ ఏమిటీ అనేది అసలు విషయంలా అనిపిస్తుంది. విరుద్ధ స్వభావాలున్న రెండు ప్రకృతి శక్తులతో అల్లూరిగా చేసున్న చరణ్ ని, కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ ని పోల్చాడు.
ఇక టైటిల్ మధ్యలో ఉన్న రణం అనే పదం వెనుక అసలు నేపథ్యం ఏమిటో తెలియాలి. వీరిద్దరి మధ్య రణమా లేక ఇద్దరూ కలిసి శత్రువులపై చేసే రణమా అనేది తెలియాల్సివుంది. ఇక ఈ మోషన్ పోస్టర్లో కీరవాణి బిజీఎమ్ అద్భుతంగా ఉన్నప్పటికీ బాహుబలి ఛాయలు కనిపించాయి. మొత్తంగా రాజమౌళి రౌద్రం రణం రుధిరం మోషన్ పోస్టర్ ఓ ఫజిల్ లా ఆసక్తికరంగా రూపొందించారు.