ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, దేశవిదేశాల్లోని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అదేంటో కానీ.. ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుండీ ఏదో ఒక అవాంతరాలను ఎదుర్కొంటూనే వస్తోంది. మొదట ఈ చిత్రంలో ఎంపికైన హీరోయిన్ తప్పుకుంది. ఆ తరువాత పూణె షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ లు గాయపడ్డారు.
దాంతో కొన్నాళ్ల పాటు షూటింగ్ వాయిదా పడింది. దాంతో మొదట 2020 జూలై 30న అనుకున్న రిలీజ్ డేట్ కాస్తా 2021 జనవరి 8కి మారింది. కానీ కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అది కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికి మళ్ళీ షూటింగ్ లు ప్రారంభమవ్వడంతో 2021 అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనుకున్న టైంకి షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.
చిత్రీకరణ క్లైమాక్స్ కు చేరుకున్న మాట వాస్తవమే..! కానీ మన జక్కన్న చెక్కుడికి మరో 5 లేదా 6 నెలలు ఎక్స్ట్రా పడుతుంది. దాంతో అక్టోబర్ నుండీ మరో 3 నెలలు ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది కూడా విడుదలవ్వడం కష్టమే అని చెప్పాలి. 2018 అక్టోబర్లో ‘అరవింద సమేత’ చిత్రం విడుదలయ్యింది. అంటే ఎన్టీఆర్ నుండీ సినిమా వచ్చి 3 ఏళ్ళు కావస్తోందన్న మాట.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!