RRR Movie Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్లానింగ్‌ అదే అంటున్నారు!

  • July 12, 2021 / 02:05 PM IST

సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అక్టోబరు 13న సినిమాను విడుదల చేస్తాం అని చిత్రబృందం ప్రకటించినప్పటి నుండి ఎప్పుడు అక్టోబరు 13 వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఆలస్యం అవ్వొచ్చు అని వార్తలొస్తున్నాయి. కానీ చిత్రబృందం మాత్రం ఆ మాట చెప్పడం లేదు. అయితే తాజాగా 15వ తేదీ మేకింగ్‌ వీడియో ఒకటి రిలీజ్‌ చేస్తాం అని చెప్పింది. దీంతో మళ్లీ వాయిదా పుకార్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఊరకనే రావంటారు సినిమా జనాలు. ఏదో అకేషన్‌ ఉండాలి, లేదంటే ఏదైనా ప్రకటన ఉంటేనే అప్‌డేట్స్‌ ఇస్తుంటారు జక్కన్న. దీంతో ఈ నెల 15న విడుదల చేస్తామంటున్న మేకింగ్‌ వీడియో వెనుక ఉన్న కారణమేంటా అని అందరూ లెక్కలేస్తున్నారు. అయితే వాటిలో ఎక్కువగా వినిపిస్తున్న లెక్క… సినిమా రిలీజ్‌ డేట్‌. ‘మేం ఇంత కష్టపడుతున్నాం… ఇంకా బాగా కష్టపడి మీకు మంచి సినిమా కావాలంటే.. ఇంకొంచెం వెయిట్‌ చేయాలి’ అనే రేంజిలో చెబుతారని అంటున్నారు.

‘బాహుబలి’ సినిమా సమయంలోనూ వాయిదాల విషయంలో జక్కన్న ఇలాంటి స్ట్రాటజీనే వాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానినే ఇక్కడా వాడుతున్నారనిపిస్తోంది. ఇక సినిమా గురించి చూస్తే… రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని చిత్రబృందమే ప్రకటించింది. ఒకవేళ ఈ పనే పెండింగ్‌లో ఉంటే… అక్టోబరు 13 ఈజీనే. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్యాచ్‌ వర్క్‌ ఇలా చాలా ఉంటాయి. కాబట్టి… రిలీజ్‌ డేట్‌ ఏమవుతుందో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus