‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత దానయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఆ చిత్రాన్ని 2021 జనవరి 8 కే విడుదల చేస్తాము అని ఎంతో ధీమాగా చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే.. ఆ చిత్రం షూటింగ్ ఆగష్టు వరకూ మొదలయ్యేలా లేదు. ఇక రాజమౌళి పనితనం గురించి తెలిసిందే.. ఆయనకీ అనుమానం వస్తే చిన్న సీన్ ను కూడా 2 వారాలు తీస్తారు. కాబట్టి 2021 సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదు అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది.
2021 సమ్మర్ కి మాత్రమే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో 2021 సంక్రాంతికి చాలా తమ సినిమాలను విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆ యాంగిల్ లో చూస్తే… మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ చిత్రం షూటింగ్ జూలై కి మొదలైతే నవంబర్ కు కాని కంప్లీట్ అవ్వదట. ఆ రకంగా చూస్తే ఈ దసరా కి ‘ఆచార్య’ విడుదల అయ్యే అవకాశం లేదు.
దాంతో 2021 సంక్రాంతికి ‘ఆచార్య’ విడుదల అయ్యే అవకాశం ఉంది. ముందుగా చరణ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేస్తే ఇక డౌట్ ఉండదని కొందరు విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. ఆ రకంగా ఆ చిత్రానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక మహేష్ -పరశురామ్ సినిమా స్క్రిప్ట్ రెడీ అయితే మూడు నెలల్లో ఫినిష్ చెయ్యాలని ఆ టీం కూడా ప్లాన్ చేస్తున్నారట. సో ఈ అవకాశాన్ని వాళ్లు కూడా ఆడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందట. మరేమవుతుందో చూడాలి.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!