‘రూలర్’ 11 డేస్ కలెక్షన్స్..!

  • December 31, 2019 / 06:03 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘రూలర్’. వీరి కాంబినేషన్లో .. గతంలో వచ్చిన ‘జై సింహా’ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలవడంతో ఈ చిత్రం పై కూడా అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే రెండో రోజు నుండీ ఈ చిత్రాన్ని పట్టించుకున్నవాళ్ళే లేరు. మాస్ జనాలు కూడా ఈ చిత్రాన్ని వదిలేసారు.

ఇక ‘రూలర్’ 11 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 2.01 cr
సీడెడ్ 2.13 cr
ఉత్తరాంధ్ర 0.59 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.44 cr
కృష్ణా 0.44 cr
గుంటూరు 1.53 cr
నెల్లూరు 0.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.14 cr
ఓవర్సీస్ 0.56 cr
వరల్డ్ వైడ్ టోటల్ 9.73 cr (share)

‘రూలర్’ చిత్రానికి 24 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14.3 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అదీ ఎలాగు సాధ్యం కాదనే చెప్పాలి.. ఇప్పటి వరకూ చాలా థియేటర్స్ లో ‘రూలర్’ చిత్రాన్ని తొలగించారు. కనీసం ఫుల్ రన్లో 10 కోట్ల షేర్ మార్క్ అయినా దాటుతుందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Click Here to Read Ruler Movie Review

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus