బన్నీ పై పుకార్లు నిజమేనా??

  • March 29, 2017 / 09:50 AM IST

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….మాస్ పల్స్ పట్టుకుంటే అర్ధం అయిపోతుంది వాళ్ళ రేంజ్ ఏంటో…అయితే అదే ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి….తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకున్న హీరో హీరో అల్లు అర్జున్.  అల్లు రామలింగయ్య తనయుడు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అయిన అల్లు అర్జున్ సినిమా వాతావరణంలో పెరగడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ తో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బన్నీ,ఆర్య,దేశముదురు చిత్రాలతో మెగాపవర్ ఏంటో చూపించాడు.

ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ పేరు తెచ్చుకున్న బన్నీ గత సంవత్సరం ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.  అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బన్నీ ‘సరైనోడు’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు….ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏదో తెలియని విషయం ఒకటి బన్నీ క్లోస్ సర్కిల్స్ వాళ్ళు బయటకు రాకుండా చూస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి…గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బన్నీపై రక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  దానికి కారణం ఏంటి అంటే…..ఆ మద్య ఓ ప్రవేట్ కార్యక్రమానికి వచ్చిన బన్నీ ముఖానికి మాస్క్ వేసుకుని రావడం చూసి అసలు ఏమైందని వార్తలు వచ్చాయి.

రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నాడని, ముఖం మీద రాషెస్ రావడంతో కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి….అయితే బన్నీ కోణం మాత్రం మరోలా ఉంది… గత వారం రోజులుగా హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి దాంతో స్వల్ప అస్వస్థత కు గురయ్యి పూర్తి రెస్ట్ తీసుకుంటున్నాని…ఈ కారణం చేత షూటింగ్ లో  పాల్గొనలేక పోతున్నా అంటున్నాడు బన్నీ… ఇక ఈ వార్త మీడియాలో ఎక్కువగా నానకుండా చిత్ర యూనిట్ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు…ఏది ఏమైనా…ఏదో తెలియని విషయం బన్నీ దాస్తున్నాడు అన్నది సినిమా సర్కిల్స్ వాదన….చూడాలి మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus