Prabhas: పెద్దమ్మ ఆశలు రేపుతుంది కానీ ఏదీ అవ్వట్లేదు.!
July 10, 2024 / 01:30 PM IST
|Follow Us
ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఏ ఇండియన్ హీరోకి లేని విధంగా ప్రభాస్ (Prabhas) కి బాక్సాఫీస్ స్టామినా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) తో ప్రభాస్ తన స్టార్ డం ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.దీనికి ముందు వచ్చిన ‘సలార్’ (Salaar) కూడా బాగానే ఆడింది. మినిమమ్ ప్రమోషన్ చేయకపోయినా ప్రభాస్ సినిమాలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.
సినిమాల పరంగా ప్రభాస్ తన ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తున్నాడు. అందులో డౌట్ లేదు. కానీ ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళు ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క నేషనల్ మీడియాలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. దాదాపు 13 ఏళ్ళ నుండి ప్రభాస్ పెళ్లి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది నేషనల్ టాపిక్ అయిపోయింది.
ఇంటర్నేషనల్ మీడియా దీనిని అంత సీరియస్ గా తీసుకోదు. పక్క దేశాల్లో పెళ్లి గురించి సీరియస్నెస్ ఉండదు.ఎటొచ్చి బాలీవుడ్ మీడియాలోనే ప్రభాస్ పెళ్లి గురించి తెగ చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రభాస్ పెళ్లి గురించి గతంలో ఆయన పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) గారు అప్డేట్స్ ఇచ్చేవారు. ఆయన పోయాక ఆ అప్డేట్స్ ఇవ్వాల్సిన భారం కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ అయినటువంటి శ్యామలా దేవి పై పడింది. ఆమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా త్వరలోనే ప్రభాస్ పెళ్లి అంటుంది.
‘అరువు రేపు’ అన్నట్టు. ప్రభాస్ వయసు 45 కి చేరుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటికి మొన్న బుజ్జి మేకింగ్ వీడియో ప్రమోషన్ కోసం తన పెళ్లి టాపిక్ కి డైవర్ట్ అయ్యేలా చేశాడు ప్రభాస్. అదంతా డైరెక్టర్ చేయమంటే చేశానని చెప్పి సైడ్ అయిపోయాడు కానీ తన పెళ్లి పై మాత్రం స్పందించలేదు.