Balakrishna: ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తారా?

  • July 18, 2022 / 05:40 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు అన్ స్టాపబుల్2 షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయింది. త్వరలో ఈ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. గోపీచంద్ మలినేని సినిమాను పూర్తి చేసి బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాపై దృష్టి పెట్టనున్నారు.

అయితే బాలయ్య ఈ సినిమాలతో పాటు మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా నటించనున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాతో మల్లిడి వశిష్ట్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన బింబిసార ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బింబిసార సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే బాలయ్య వశిష్ట్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది.

మరి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి. నిర్మాతల హీరోగా పేరును సొంతం చేసుకున్న బాలకృష్ణ యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చినా ఆయనతో సినిమాను నిర్మించడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉంటారు. బాలయ్య తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. సినిమాసినిమాకు హీరోగా బాలయ్య రేంజ్, మార్కెట్ పెరుగుతోంది.

మాస్ ప్రేక్షకులతో పాటు యూత్ లో కూడా బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus