పాయల్ కి కూడా హెబ్బా గతే పట్టేలా ఉంది

  • April 1, 2019 / 07:20 PM IST

“కుమారి 21ఎఫ్” విడుదలైన కొత్తలో హెబ్బా పటేల్ చూసినవాళ్ళందరూ అమ్మాయి గ్లామర్ & బోల్డ్ నెస్ కి సినిమా ఇండస్ట్రీలో జనాలందరూ “ఈ అమ్మాయి పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది” అని ఫిక్స్ అయిపోయారు. కానీ.. ఆమె తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ కారణంగా ఆమె కెరీర్ ఏమైందో అందరూ చూశారు. ఇప్పుడు “ఆర్ ఎక్స్ 100” ఫేమ్ పాయల్ ది కూడా అదే పరిస్థితి.

ఎవ్వరూ ఊహించని విధంగా సూపర్ హిట్ సాధించడమే కాక సెన్సేషనల్ కలెక్షన్స్ వసూలు చేసిన “ఆర్ ఎక్స్ 100” విడుదల తర్వాత పాయల్ కి వచ్చిన క్రేజ్ చూసి అందర్నీ మతిపోయింది. ముఖ్యంగా ఆమె హాట్ ఫోటోస్, వీడియోస్ చూసి అమ్మడు కూడా పెద్ద హీరోయిన్ అయిపోతుంది అని అంచనా వేశారు. అందుకు తగ్గట్లే అమ్మడు వెంకటేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకొంది. కానీ.. హెబ్బా తరహాలోనే మనీ కోసం మూవీస్ ఒప్పుకోవడం మొదలెట్టింది. నిన్న ఆమె తాజా చిత్రం “ఆర్ డి ఎక్స్” మొదలైంది. “హుషారు” ఫేమ్ తేజస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. నిజానికి పాయల్ కి ఉన్న క్రేజ్ కి ఈ సినిమా పెద్ద మైనస్ అవుతుందనే చెప్పాలి. ఇలా ఈ పరిస్థితుల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ రోళ్స్ చేయడం నఏడి ఎంతమాత్రం కరెక్ట్ కాదు. మరి పాయల్ ఈ విషయాన్ని ఎప్పుడు గమనిస్తుందో ఏమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus