సంచలన కామెంట్స్ చేసిన ఆర్ఎక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్!

  • August 4, 2018 / 04:56 AM IST

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన”ఆర్‌ఎక్స్ 100″ సినిమా గతనెల రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టిన ఈ సినిమా 12 కోట్ల షేర్ ని అధిగమించి దూసుకుపోతోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంలో పాయల్ రాజ్ పుత్ భాగం ఎక్కువని సినీ విశ్లేషకులు తేల్చేశారు. ఆమె రొమాన్స్,  పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయని కితాబు ఇస్తున్నారు.  హీరోహీరోయిన్లు కలిసేటప్పుడల్లా హీరో బటన్లు ఊడదీయం లాంటి సీన్లు యువకులకు కిక్ ఇచ్చాయి.

ఈ సినిమా కోసం డైరక్టర్ అజయ్ భూపతి 45 సార్లు అలా వాడుకున్నారని పాయల్ రాజ్ పుత్ సంచలన కామెంట్స్ చేసింది. ఎలా ? అని ప్రశ్నించగా.. సినిమాలో తాను హీరోకి 45 సార్లు ముద్దులు పెట్టానని,   అంతేకాదు గట్టిగా కౌగిలించునున్నానని  వివరించింది. ఇదంతా కేవలం తను సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకే చేశానని స్పష్టం చేసింది.  సినిమా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందని వివరించింది. ఈ సినిమాకి 6 లక్షలు మాత్రమే తీసుకున్నప్పటికీ… నెక్ట్స్ మూవీ నుంచి మాత్రం రెమ్యునరేషన్‌ను బాగా పెంచుతానని స్పష్టం చేసింది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ డేట్స్ కోసం చాలామంది దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు. మరి ఏ సినిమాకి ఆమె ఓకే చెబుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus