Saakini Daakini Review: శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 16, 2022 / 11:57 AM IST

కొరియన్ చిత్రం “మిడ్ నైట్ రన్నర్స్”కి రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన చిత్రం “శాకిని డాకిని”. అక్కడ మేల్ సెంట్రిక్ గా రూపొందిన చిత్రాన్ని ఇక్కడ ఫీమేల్ సెంట్రిక్ గా తెరకెక్కించారు. డైరెక్టర్ టైటిల్ కార్డ్ పడిన సుధీర్ వర్మ ప్రమోషన్స్ టైమ్ లో ఎక్కడా కనిపించకపోవడం ఈ సినిమా విషయంలో ప్రశ్నార్ధకంగా మారగా.. ట్రైలర్ & ప్రెస్ మీట్/ప్రమోషన్స్ లో రెజీనా చేసిన అతి మాత్రం సినిమాకి మంచి బజ్ తెచ్చిపెట్టింది. మరి సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!

కథ: పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ కు సెలక్ట్ అయిన దామిని (రెజీనా), షాలిని (నివేదా థామస్)లకు మొదటి నుండి ఒకరంటే ఒకరికి పడదు. అలా కొట్టుకుంటూ.. తిట్టుకుంటూనే స్నేహితులవుతారు. ఒకానొక సందర్భంలో వాళ్ళ కళ్లెదుటే ఒక అమ్మాయి కిడ్నాప్ అవ్వడం చూసి.. ట్రైనీ పోలీసులుగా బాధ్యత ఫీలై..

ఆ అమ్మాయిని కాపాడడం కోసం ప్రయత్నించి మొదటిసారి విఫలమవుతారు.  అనంతరం దామిని-షాలిని కలిసి ఆ అమ్మాయిని మాత్రమే కాక.. హ్యూమన్ ట్రాఫిక్కింగ్ గ్యాంగ్ ను ఏ విధంగా పోలీసులకు పట్టించారు అనేది “శాకిని డాకిని” కథాంశం.

నటీనటుల పనితీరు: తెలంగాణ యాసలో, బబ్లీగా కనిపిస్తూ, చక్కని స్క్రీన్ ప్రెజన్స్ & పెర్ఫార్మెన్స్ తో ఎక్కువ మార్కులు కొట్టేసింది నివేదా థామస్. నటిగా పర్వాలేదనిపించుకున్నా… లుక్స్ వైజ్ ఆడియన్స్ ను అలరించలేకపోయింది రెజీనా. ఆమె ట్రై చేసిన కొత్త లుక్ పెద్దగా ఆకట్టుకోలేదు. సుదర్శన్, హేమంత్, చమ్మక్ చంద్ర, రవివర్మ, కబీర్ సింగ్, భూపాల్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సుధీర్ వర్మ ప్రమేయం ఈ సినిమా విషయంలో ఎంత ఉందో తెలియదు కానీ.. మేకింగ్ & ఎడిటింగ్ విషయంలో ఎక్కడా అతడి మార్క్ మాత్రం కనిపించలేదు. అందువల్ల.. సుధీర్ వర్మ సినిమాల్లో కనిపించే ఫ్రేమ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఈ చిత్రంలో కనిపించదు. అయితే.. కొరియన్ కథకు ఇండియన్ నేటివిటీకి యాప్ట్ అయ్యేలా తీర్చిదిద్దిన విధానం మాత్రం బాగుంది. అయితే.. ఫస్టాఫ్ లో ఉన్న ఉత్సాహం, సెకండాఫ్ లో కనిపించదు. అందువల్ల.. సెకండాఫ్ మొదలయ్యేటప్పటికే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు.

నేపధ్య సంగీతం కానీ పాటలు కానీ ఎలాంటి ఆసక్తి క్రియేట్ చేయలేకపోయాయి. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. యాక్షన్ సీన్స్ & నైట్ సీన్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ సోసోగా ఉండగా.. ఆర్క్ వర్క్ బాగుంది.

విశ్లేషణ: “శాకిని డాకిని” కొత్త తరహా సినిమా ఏమీ కాదు. కానీ.. ఫిమేల్ సెంట్రిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే.. ఇంటర్వెల్ బ్లాక్ కే సినిమా అయిపోయిందన్నట్లుగా క్రియేట్ అయిన ఇంపాక్ట్, సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే కానీ లాజిక్స్ కానీ సింక్ అవ్వకపోవడం అనేది మైనస్ గా మారింది. ఓవరాల్ గా టైమ్ పాస్ ఎంటర్ టైనర్ గా “శాకిని డాకిని” మిగిలిపోయింది.

రేటింగ్: 2/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus