Sai Dharam Tej: మీకు పవర్ స్టార్.. నాకు గురువు.. నా పేరు మీద పార్టీ చేసుకోండి!
September 1, 2022 / 10:27 AM IST
|Follow Us
బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ అభిమానుల ముందుకు పెద్దగా వచ్చింది లేదు. ఒకటి, రెండు సందర్భాల్లో కనిపించినా అది తక్కువే అని చెప్పాలి. తొలిసారిగా మంగళవారం అభిమాన సందోహం మధ్యలోకి వచ్చాడు. దీంతో తన మనసులోని భావాలను చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురవ్వగా, అభిమానులు సైతం అలాంటి పరిస్థితిలోకే వెళ్లారు. కారణం యాక్సిడెంట్, ఆ తర్వాతి పరిస్థితుల గురించి సాయితేజ్ మాట్లాడటమే. ‘‘మా మావయ్యలు ముగ్గురూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.
అంతేకాదు మమ్మల్ని కూడా ఇలానే కష్టపడి పైకి రావాలని చెబుతూ ఉంటారు. జీవితంలో, కెరీర్లో ఎప్పుడూ కష్టపడి అనుకున్నది సాధించాలని చెబుతుంటారు. అలా వారే మా స్ఫూర్తి అని’’ చెప్పాడు సాయితేజ్. ఆ తర్వాత తన యాక్సిడెంట్ ప్రస్తావనను తీసుకొచ్చాడు. ‘‘ఇంటికి అందరూ జాగ్రత్తగా వెళ్లాలని, బైక్‌పై వెళ్లేటపుడు మరింత జాగ్రత్త వహించండని.. అస్సలు వేగంగా వెళ్లవద్దు’’ అని కోరాడు సాయితేజ్. ‘‘బైక్ మీద వీధి చివరకు వెళ్లాల్సి వచ్చినా.. తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించాడు.
నాకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో హెల్మెట్ లేకపోతే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిలబడి మాట్లాడలేకపోయేవాణ్ని’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సాయితేజ్. అతని మాటలకు పక్కనే ఉన్న వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఎదురుగా ఉన్న అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. సాయితేజ్ మాట్లాడుతున్నప్పుడు అలా వింటూ ఉండిపోయారు. ‘‘నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా ఫ్యామిలీకి సుమ అక్క ఎంతో హెల్ప్ చేసింది. నా సినిమా ‘రిపబ్లిక్’ రిలీజ్‌కు ముందే యాక్సిడెంట్ అయింది. ఏం జరుగుతోందో నాకు తెలీదు.
నా తమ్ముడు వచ్చి అన్నా అని పిలస్తే పలకలేకపోయాను. ఈ క్రమంలో నాకు ధైర్యం ఇచ్చింది నా కుటుంబం. వారు నా బలం’’ తన మాటలతో అందరి కంటా తడి పెట్టించాడు సాయితేజ్. తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘నేను స్టేజ్ ఎక్కినా, కింద ఉన్నా వీణ్ని ఆటపట్టించడం అంటే నాకు చాలా ఇష్టం.
అంతేకాదు వీడు నవ్వుతుంటే ఇంకా ఇష్టం. నేనేమీ 90 వేయలేదు, అయినా నాకు తాగడం అలవాటు లేదు’’ అన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘‘పవన్ కల్యాణ్ మీ అందరికీ పవర్ స్టార్. నాకు ఆయన గురువు. నా గురువు పుట్టిన రోజు నాడు ‘రంగ రంగ వైభవంగా’ వస్తోంది. ఆ సినిమ చూసి, నా పేరు మీద ఆయన బర్త్ డే పార్టీ చేసుకోండి’’ అంటూ ప్రసంగం ముగించాడు సాయితేజ్.