Sai Dharam Tej: అమ్మ గొప్పదనం చెప్పిన సాయితేజ్.. ఆ సమయంలో ఇబ్బందులంటూ?
March 8, 2024 / 02:25 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సాయితేజ్ (Sai Dharam Tej) విరూపాక్ష (Virupaksha) సినిమాతో సక్సెస్ సాధించగా (BRO) బ్రో సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నారు. సాయితేజ్ ప్రస్తుతం (Sampath Nandi) సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది. సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే సాయితేజ్ తాజాగా అమ్మ గొప్పదనం చెబుతూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమా రంగంలోకి రావడానికి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నానని సాయితేజ్ పేర్కొన్నారు. రేయ్ (Rey) మూవీ ఓపెనింగ్ అయిన తర్వాత ఒకానొక సమయంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేక ఇబ్బందులు పడ్డానని సాయితేజ్ వెల్లడించారు. నా అకౌంట్ లో ఎక్కువగా డబ్బులు లేవని అయితే బ్యాలెన్స్ చెక్ చేస్తే లక్ష నుంచి 2 లక్షల మధ్యలో బ్యాలెన్స్ చూపించిందని ఆయన తెలిపారు.
అమ్మకు వెంటనే ఫోన్ కాల్ చేయగా రాత్రి నువ్వు డబ్బులు లేవని చెప్పావు కదా అందుకే వేశానని ఈ నెల గడిచిపోతుంది కదా అని అని అమ్మ చెప్పిందని సాయితేజ్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో ఏటీఎం నుంచి బయటకు వచ్చి ఏడ్చేశానని ఆయన అన్నారు. అమ్మకు మాత్రమే ఎప్పుడు ఏం ఇవ్వాలో తెలుస్తుందని అదే అమ్మ గొప్పదనం అని సాయితేజ్ కామెంట్లు చేశారు.
సాయితేజ్ వరుస సినిమాలతో బిజీ కావడంతో పాటు వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విరూపాక్ష మూవీ సక్సెస్ తో సాయితేజ్ రెమ్యునరేషన్ పెరిగిందని తెలుస్తోంది. ఈ ఏడాది సాయితేజ్ నటించిన ఒక సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. సాయితేజ్ వేగంగా సినిమాలలో నటించడం కంటే మంచి కథలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.