మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి ధరంతేజ్ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ఈయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఏలూరులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తాను ప్రమాదానికి గురై ఎంతోమందిని టెన్షన్ పెట్టాను అందుకు తనని క్షమించమని ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత తనకు స్పృహ రాగానే మొదటగా చూసినది తన అమ్మ తమ్ముడిని అని సాయిధరమ్ తెలిపారు.
ఆ క్షణం వారికి సారీ చెప్పడానికి నా నోట నుంచి మాట కూడా రాలేదని తెలిపారు. ఆ క్షణమే ఒక బాధ మనిషిని ఎంతగా మారుస్తుందో తాను తెలుసుకున్నానని తెలిపారు. ఎలాగైనా మాట్లాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. మీ ప్రేమ పొందటమే నా లక్ష్యంగా చేసుకొని మీ ప్రేమను పొందాలని తెలిపారు. మీరు కూడా మీ లక్ష్యం కోసం ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా లక్ష్యాలను సాధించాలని తెలిపారు. అలాగే మీరు ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.
ఈ సినిమా వేడుకలో భాగంగా సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సాయి ధరమ్ తేజ సరసన నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇలా ప్రమాదం తర్వాత సాయి ధరంతేజ్ మొదటిసారిగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఇతనికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!