సాయిధరమ్ తేజ్ ఇప్పటికైనా స్క్రిప్ట్స్ మీద కాన్సన్ ట్రేట్ చేయాలి
July 6, 2018 / 12:44 PM IST
|Follow Us
“పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం” సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొనేసరికి మెగా ఫ్యామిలీ నుంచి మరో సక్సెస్ ఫుల్ హీరో వచ్చాడని మెగా అభిమానులందరూ సంతోషపడి ఆ ఆనందాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించేలోపే “తిక్క”తో చిన్న జర్క్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. ఇక అప్పట్నుంచి మొదలైన ఫ్లాపుల పరంపర ఇవాళ విడుదలైన “తేజ్ ఐ లవ్ యూ” వరకూ కొనసాగుతూ వచ్చింది. యంగ్ హీరో ఆయ్యుండి తన తోటి హీరోలైన వరుణ్ తేజ్, నానిలు మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంటే.. సాయిధరమ్ తేజ్ మాత్రం ఏమాత్రం పసలేని కథలు, ఆకట్టుకోలేని కథనాలతో ప్రేక్షకుల్ని మెప్పించలేక ఢీలాపడుతున్నాడు.
ముఖ్యంగా వరుసగా వచ్చిన అయిదు ఫ్లాపులను కూడా కన్సిడర్ చేయకుండా.. కథ అనేది ఏమాత్రం లేని “తేజ్ ఐ లవ్ యూ” చిత్రాన్ని ఎలా ఇప్పుకొన్నాడు? లేక అల్లు అరవింద్ రీసెంట్ గా ఆడియో ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు ఈ సినిమా కూడా కేవలం ఇచ్చిన మాట కోసం చేశాడా? అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. తేజు గనుక ఇదే విధంగా తన కెరీర్ ను కొనసాగిస్తే త్వరలోనే కెరీర్ కు బ్రేక్ కాదు ఏకంగా అడ్డుగోడ పడడం ఖాయం.