Sai Kumar: సాయికుమార్ కీలక నిర్ణయం!

  • June 24, 2021 / 09:36 AM IST

గత కొన్నాళ్లుగా ‘మా’ ఎలెక్షన్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈసారి కూడా అలాంటి సంచలనానికి తెరలేపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ లతో పాటు సీనియర్ నటి హేమ కూడా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనుంది. ఇప్పుడు మరో సీనియర్ నటుడు కూడా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన సాయి కుమార్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయబోతున్నారని సమాచారం.

గత కొంతకాలంగా ‘మా’ వ్యవహారాల విషయంలో సాయికుమార్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రతీసారి ఎన్నికల సమయంలో పిలిచి.. ఆయనకు చిన్న చిన్న పోస్ట్ లను ఆఫర్ చేస్తున్నారు. ఆయన కాదనలేక ఇబ్బంది పడుతున్నారు. తనకున్న అనుభవానికి ఆఫర్ చేసే పోస్ట్ లకు సంబంధం ఉండడడం లేదు. తనను ఇలా చిన్న పోస్ట్ లకే పరిమితం చేస్తుండడంతో ఆయన మదన పడుతున్నారు. అందుకే ఇప్పుడు ప్యానెల్ తో సంబంధం లేకుండా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus