Sai Pallavi: బోనమెత్తిన సాయి పల్లవి.. ఫోటో వైరల్?

  • July 25, 2022 / 07:32 AM IST

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రతిఏటా ఆషాడమాసంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆడపడుచులు బోనాలతో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే నేడు తెలంగాణలో పెద్ద ఎత్తున బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ విధంగా బోనాల ప్రత్యేకంగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో పాటలు ఇలాంటి సన్నివేశాలను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇకపోతే తాజాగా రానా సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.

ఇకపోతే ఈ సినిమాలో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకులు. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఈ సినిమాలో సాంప్రదాయ దుస్తులైన లంగా వోని ధరించి బోనం ఎత్తుకొని వచ్చే సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. అయితే నేడు బోనాలు స్పెషల్ కావడంతో దర్శకుడు వేణు సాయి పల్లవి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌తో డైరెక్టర్‌ వేణు ఊడుగుల శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి పర్వావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ ఇది.. అంటూ ఈయన సాయి పల్లవి బోనం ఎత్తిన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా సాయి పల్లవి అచ్చం తెలంగాణ ఆడపడుచుల బోనం ఎత్తుకున్న ఫోటో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus