Sai Pallavi: సోషల్ మీడియాపై సాయిపల్లవి కామెంట్స్!

  • October 17, 2022 / 03:25 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. ఇక్కడ అభిమానులు ఆమెని లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అంతగా అందరి అభిమానం సంపాదించుకుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈమె నుంచి చివరిగా ‘గార్గి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇదిలా ఉండగా… తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ముందుగా తన డైట్ గురించి మాట్లాడింది. తను పూర్తిగా శాఖాహారినని.. అన్నం, పప్పు ఉంటే చాలని చెప్పింది. సెట్ లో కొబ్బరినీళ్లు, మజ్జిగ ఉంటే ఇంకేం అడగనని చెప్పుకొచ్చింది. అసలు బరువు పెరగనని.. అందుకే జిమ్ లో కసరత్తులు చేసే అవసరం లేదని చెప్పింది. అప్పుడప్పుడు సరదాగా బాడ్మింటన్ ఆడతానని తెలిపింది. సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. అదొక టైమ్ వేస్ట్ వ్యవహారమని చెప్పింది.

సోషల్ మీడియాతో పెద్దగా టచ్ లో ఉండనని.. ముఖ్యమైన విషయాలేమైనా ఉంటే తన చెల్లి చెబుతుందని చెప్పుకొచ్చింది. ఇదే ఇంటర్వ్యూలో మహేష్ బాబుని తెగ పొగిడేసింది. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉంటుందని తెలిపింది. అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.

బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పింది. తన డాన్స్ టాలెంట్ గురించి మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ఎక్కడా డాన్స్ నేర్చుకోలేదని తెలిపింది. మాధురి దీక్షిత్ డాన్స్ వీడియోలు చూసి ఆ స్టెప్పులు ప్రాక్టీస్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus