Sai Pallavi: ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకోవడం పై సంతోషం వ్యక్తం చేసిన సాయి పల్లవి!

  • October 13, 2022 / 12:03 PM IST

ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల ఈ వేడుకలను నిర్వహించలేదు. ఈ క్రమంలోనే ఆదివారం బెంగుళూరులో ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరిగాయి.ఏడాది ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పుష్ప సినిమా ఫిలింఫేర్ అవార్డులలో తమ సత్తా చూపించింది. అలాగే కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి సూర్య నటించిన సురారై పొట్రు సినిమాకు గాను పెద్ద ఎత్తున అవార్డులు వచ్చాయి.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఒకేసారి రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకోవడం విశేషం. గత ఏడాది సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ శింగరాయ్ సినిమాలు విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలలో నటించినందుకుగాను సాయి పల్లవి ఉత్తమ నటిగా రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… జీవితంలో ఇలాంటి రోజులు తరచుగా రావు ఓకే సంవత్సరంలో ఇలా రెండు సినిమాల నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్రలలో నటించినందుకు నాకు దొరికిన అపారమైన ప్రేమకు కృతజ్ఞురాలిని నాకు ముందు ముందు కూడా ఇలాంటి పాత్రలు మరెన్నో పొందాలని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. ఈ విధంగా సాయి పల్లవి రెండు సినిమాలుకుగాను ఉత్తమ నటిగా అవార్డును అందుకోవడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సాయి పల్లవి పోస్ట్ పై స్పందించిన అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక సాయి పల్లవి తెలుగులో చివరిగా విరాటపర్వం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus