Sai Pallavi: సాయి పల్లవి నో చెప్పిన ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..?

  • February 25, 2023 / 03:06 PM IST

సాయి పల్లవి.. మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ బ్యూటిఫుల్ డ్యాన్సర్.. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.. మలయాళం ‘ప్రేమమ్’ లో తన పర్ఫార్మెన్స్‌కి భాషతో సంబంధం లేకుండా ప్రేమలో పడిపోయారు ప్రేక్షకులు.. తన నవ్వు, అమాయకత్వంతో కూడిన చిలిపి చూపులు ఆకట్టుకున్నాయి.. టాలీవుడ్ ఎంట్రీతోనే తెలుగు ఆడియన్స్ ‘ఫిదా’ అయిపోయారు.. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తే నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టుంటుంది..

‘ఎమ్‌సీఏ’, ‘పడి పడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘విరాట పర్వం’ ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. సినిమా సినిమాకీ నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సాయి పల్లవి.. తమిళంలో ధనుష్ ‘మారి 2’, సూర్య ‘ఎన్‌జికె’ మూవీస్ చేసింది.. ‘మారి 2’ లో తన యాక్టింగ్, డ్యాన్స్‌కి కోలీవుడ్ వాళ్లు కూడా ‘ఫిదా’ అయిపోయారు..

కెరీర్ స్టార్టింగ్ నుండి కేవలం నటనకు ఆస్కారమున్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది సాయి పల్లవి.. ఇతర హీరోయిన్లు ఉండే సినిమాలు వేరు.. హీరోయిన్‌గా సాయి పల్లవి ఉంటే ఆ సినిమా వేరు అనేంతగా ముద్ర వేసింది.. మరి డాక్టర్ కావాల్సిందిపోయి యాక్టర్ అయిందంటే మామూలు విషయం కాదు కదా.. అందుకే కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.. అయితే ఈ మధ్య కాలంలో తమిళనాటు ఇద్దరు అగ్రహీరోల చిత్రాలకు సాయి పల్లవి నో చెప్పింది అనే న్యూస్ వైరల్ అవుతోంది.. ఆ స్టార్స్ ఎవరో కాదు..

‘తల’ అజిత్ కుమార్.. ‘దళపతి’ విజయ్.. అజిత్ పక్కన ‘వలిమై’ లో కథానాయికగా చెయ్యమంటే.. క్యారెక్టర్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని నో చెప్పేసింది.. విజయ్ ‘వారిసు విషయంలోనూ అదే మాట చెప్పింది.. నిజానికి హీరోయిన్ రోల్‌కి ప్రాధాన్యత లేదనే సంగతి రష్మికకు తెలిసినా కానీ విజయ్ పక్కన నటించాలనే కోరికతో ఓకే చేసింది.. వచ్చిన ఆఫర్లను వరుస పెట్టి చేసుకుంటుూ వెళ్తున్న ఈరోజుల్లో కూడా సాయి పల్లవి తన మనసుకు నచ్చినట్టు నడుచుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.. ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోందామె..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus