Sai Pallavi: వామ్మో.. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మామూలు అమ్మాయి కాదుగా!
May 15, 2023 / 03:05 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సాయిపల్లవిని ఎంతగానో అభిమానిస్తారు. సాయిపల్లవి స్టార్ హీరోయిన్ అయినా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. ఇతర స్టార్ హీరోయిన్లకు, సాయిపల్లవికి చాలా తేడాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. సాయిపల్లవి ఏడో తరగతిలోనే ఒక కుర్రాడికి ఫిదా అయ్యి ఆ అబ్బాయి కోసం లవ్ లెటర్ రాశారట.
అయితే ఆ అబ్బాయికి లవ్ లెటర్ ఇవ్వడానికి సాయిపల్లవికి ధైర్యం చాలలేదట. డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేక లవ్ లెటర్ ఇవ్వలేకపోయిన సాయిపల్లవి ఆ లవ్ లెటర్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడటం గమనార్హం. తన బుక్ లో సాయిపల్లవి ఆ లెటర్ ను దాచుకోగా సాయిపల్లవి అమ్మ ఆ లెటర్ ను చూసి సీరియస్ అయ్యారని సమాచారం. తల్లి చేతిలో సాయిపల్లవి తన్నులు కూడా తిన్నారట. అయితే ఇప్పుడు మాత్రం ఈ హైబ్రీడ్ పిల్ల పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
సాయిపల్లవి వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి రెమ్యునరేషన్ 2 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. కెరీర్ విషయంలో ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కథ నచ్చితే పెద్దగా గుర్తింపు లేని హీరోలకు జోడీగా నటించడానికి కూడా సాయిపల్లవి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
సాయిపల్లవి గురించి ఎలాంటి రూమర్లు కూడా ప్రచారంలోకి లేదు. సాయిపల్లవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధించి ఆమె రేంజ్ ను పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయిపల్లవి కెరీర్ విషయంలో ఇతర హీరోయిన్లకు భిన్నంగా అడుగులు వేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.