Sai Pallavi: అలా చూసి సాయిపల్లవి ఫ్యాన్స్ తట్టుకోగలరా?

  • May 27, 2022 / 11:49 AM IST

సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలలో నటించడానికి చాలా ఆసక్తి చూపే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు సాయిపల్లవి నటిస్తే సినిమా హిట్ అనే భావన చాలామందిలో ఉంది. రొటీన్ పాత్రలకు దూరంగా ఉంటున్న సాయిపల్లవి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే రానా హీరోగా తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో సాయిపల్లవి పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. సినిమాలో ఇదే ట్విస్ట్ గా ఉండనుందని సమాచారం.

సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి పాత్ర చేతిలో సాయిపల్లవి పాత్ర చనిపోతుందని బోగట్టా. జులై 1వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎపిక్ క్లాసిక్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి వెన్నెల రోల్ లో కనిపించనున్నారు. ట్రాజెడీ ఎండింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో టాలీవుడ్ ప్రేక్షకులు, సాయిపల్లవి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

అదిలాబాద్ జిల్లాలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా సాయిపల్లవి పాత్రను తీర్చిదిద్దారని సమాచారం అందుతోంది. సాయిపల్లవి కెరీర్ లో స్పెషల్ సినిమాగా విరాటపర్వం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైనా ఈ సినిమా అభిమానులు మాత్రం ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా సినిమాలో ఉద్యమ నాయకుడు రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus