Sai Pallavi: అలా మాట్లాడిన లైంగికంగా వేధించినట్లే: సాయి పల్లవి

  • March 10, 2023 / 03:31 PM IST

సినిమా ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో నటి సాయి పల్లవి ఒకరు. ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సాయి పల్లవి గత కొద్దిరోజులుగా ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించకుండా ఉన్నారు. ఇలా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి పెళ్ళికి సిద్ధమయ్యారని అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఆమె వైద్య వృత్తిలో స్థిరపడబోతున్నారు అంట కామెంట్లు చేస్తున్నారు.ఇలా సాయి పల్లవి కొత్త సినిమాలను ప్రకటించకపోవడంతో వివిధ రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సాయి పల్లవి తాజాగా నిజం విత్ స్మిత కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సాయి పల్లవి కాస్టింగ్ కౌచ్ గురించి మీ టు ఉద్యమం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా స్మిత సాయి పల్లవిని ప్రశ్నిస్తూ.. ఒకప్పుడు మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టించింది. సోషల్ మీడియాలో ఎంతోమంది దీనిపై మాట్లాడారు. దీనిపై మీ ఉద్దేశం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ… మీరు శారీరకంగా వేధింపులకు గురి చేయకపోవచ్చు కానీమాటలతో ఇబ్బంది పెట్టడం కూడా లైంగిక వేధింపులకు కారణమే అంటూ ఈ సందర్భంగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇలా మొదటిసారి ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మార్చి 10వ తేదీ ప్రసారం కానుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus