Sai Pallavi: అలా చేసినా వేధింపులతో సమానం.. సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్!

  • March 10, 2023 / 12:53 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. నిజం విత్ స్మిత టాక్ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో స్మిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఈ ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నావు అనే ప్రశ్నకు సాయిపల్లవి స్పందిస్తూ ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.

గతంలో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టించిందని సోషల్ మీడియాలో ఎంతోమంది మీటూ ఉద్యమంపై గళమెత్తారని ఆ ఉద్యమంపై మీ అభిప్రాయం ఏంటని సాయిపల్లవిని అడగగా మీరు శారీకరంగా వేధింపులకు గురి కాకపోవచ్చని అయితే మాటలతో పక్కవారిని ఇబ్బంది పెట్టినా అది వేధింపులతో సమానమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంతోమంది ఆడవాళ్లకు సాయిపల్లవి స్పూర్తిగా నిలిచారనే సంగతి తెలిసిందే. మంచి యాక్టర్ మాత్రమే కాకుండా మంచి మెడికో అని కూడా చెప్పొచ్చుగా అని సాయిపల్లవి కామెంట్లు చేశారు.

సాయిపల్లవి రెమ్యునరేషన్ ప్రస్తుతం కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉంది. సాయిపల్లవికి ఇతర భాషల్లో సైతం మంచి పేరు ఉంది. కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో సాయిపల్లవి ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం. సాయిపల్లవికి సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతోంది. సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా పుష్ప2 సినిమాలో సాయిపల్లవి నటిస్తున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చారు. సాయిపల్లవి భవిష్యత్తులో డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని భావిస్తున్నారు.

సాయిపల్లవి సినిమాలకే పరిమితం అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమాల విషయంలో సాయిపల్లవి ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండటం వల్లే ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం సాయిపల్లవికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సాయిపల్లవి స్టార్ హీరోల ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus