అల్లు అర్జున్ ని దువ్వుతున్న బాలీవుడ్ భామ..?

  • February 8, 2021 / 05:30 PM IST

అల వైకుంఠపురములో సినిమా తర్వాత బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఇందులో హీరోయిన్స్ అయితే మరీనూ. అల్లు అర్జున్ డ్యాన్స్ కి ఫిదా అయిపోయారు. సినిమా విడుదల అయ్యి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పనిగట్టుకుని మరీ పొగుడుతోంది సాయి మంజ్రేకర్. దంబాగ్ లో నటించిన ఈ సుందరి ఇప్పుడు అల్లు అర్జున్ ని ఎందుకు పొగుడుతోందా అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

ఓ మీడియా ఇంటర్వూలో టాలీవుడ్ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ తో నటించాలన్నదే తన కోరిక అని స్ట్రయిట్ గా చెప్పేస్తోంది. అలవైకుంఠపురంలో సినిమాని చూశానని అందులో స్టైలిష్ స్టార్ డాన్స్, యాక్టింగ్ అదరహో అంటూ కితాబిచ్చింది. ఆయనతో ఒక్క ఛాన్స్ వస్తే చాలంటోంది. ప్రస్తుతం తెలుగులో అడవిశేష్ మేజర్ , వరుణ్ తేజ్ గని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది సాయి మంజ్రేకరం. మెగా కాంపౌండ్ లో హీరోయిన్ అయితే చాలు. కుర్రహీరోలందరితో ఆఫర్ వస్తుందని తెలిసిపోయినట్లు ఉంది.

అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ ని బుట్టలో వేస్తోంది ఈ భామ. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల డైరక్షన్ లో బన్నీ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ అనే పేరు రీసంట్ గా వినిపించింది. మరి అమ్మడి ఇంటర్య్వూని బట్టీ చూస్తే ఇది నిజమవుతుందా అనే అనిపిస్తోంది. మరి చూద్దాం ఈ బ్యూటీ అదృష్టం ఎంతవరకూ ఉంటుంది అనేది. అదీ విషయం.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus