Saif Ali Khan: అలాంటి కామెంట్లతో బాధ పెట్టొద్దు.. సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్ వైరల్!
February 10, 2024 / 10:55 AM IST
|Follow Us
ఆదిపురుష్, దేవర సినిమాలతో సౌత్ లో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన నటులలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. సౌత్ భాషల్లో విలన్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తున్న సైఫ్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. కరీనా కపూర్ తో పెళ్లికి ముందు సైఫ్ అమృతా సింగ్ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత రోజుల్లో వేర్వేరు కారణాల వల్ల సైఫ్ అమృతా సింగ్ కు విడాకులు ఇచ్చారు.
విడాకులు తీసుకున్న సమయంలో నన్ను, నా తల్లిని, నా సోదరిని ఇష్టానుసారం తిట్టారని అవమానాలకు గురి చేయడంతో పాటు మానసికంగా వేధించారని నేను అన్నింటినీ భరించానని సైఫ్ అలీ ఖాన్ పేర్కొన్నారు. నెమ్మదిగా విడాకుల నుంచి బయటపడి నటి రోసాతో డేటింగ్ చేశానని అలా చేయడం వల్ల ఎవరికి హాని ఉందని కామెంట్లు చేశారు. విడాకుల తర్వాత పిల్లలను పట్టించుకోకుండా ఎప్పుడూ వదిలేయలేదని సైఫ్ తెలిపారు.
మొదటి భార్య ఫ్యామిలీకి ఎప్పుడూ అండగా ఉన్నానని కస్టడీ కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ పోరాడాలని అనుకోలేదని సైఫ్ కామెంట్లు చేశారు. అమృతా సింగ్ కు 5 కోట్ల రూపాయల భరణం ఇవ్వాలని అందులో సగాన్ని ఇప్పటికే చెల్లించానని ఆయన పేర్కొన్నారు. కొడుకు ఇబ్రహీంకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పానని ఆయన వెల్లడించారు.
స్టార్ హీరో షారుఖ్ లా నా దగ్గర పెద్ద సంపద లేదని యాడ్స్, స్టేజీ షోలు, సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వాళ్లకే అంకితం చేశానని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చారు. ఎత్తిపొడుపు మాటలతో నన్ను పదేపదే చంపొద్దు అని ఆయన కామెంట్లు చేశారు. సైఫ్ అలీ ఖాన్ 2012 సంవత్సరంలో కరీనా కపూర్ ను పెళ్లాడగా ఈ జంటకు తైమూర్, జే అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సైఫ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. (Saif Ali Khan) సైఫ్ ను తప్పుగా అర్థం చేసుకున్నామని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.